Happy Vinayaka Chavithi Subhakankshalu Telugu వినాయక చవితి పండుగ అంటేనే సందడి. బంధుమిత్రులందరూ అందరూ కలిసి జరుపుకునేది. అయితే.. మనకు దూరంగా ఉండే కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పండుగ శుభాకాంక్షలు చెబుతుంటాం. అదేవిధంగా ఈసారి కూడా ఇలా సింపుల్ విషెస్ పంపేయండి..
Vinayaka Chavithi 2025 Wishes వినాయకుడిని భక్తితో పూజిస్తే తలపెట్టిన ఏ కార్యంలో అయినా ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారని నమ్మకం. అందుకే గణేష్ చతుర్థి పండుగ రోజు విఘ్నహర్త అయిన వినాయకుడి పూజ ఘనంగా చేస్తారు. ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ వస్తుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) పండుగ ఆగస్టు 27న వచ్చింది. ఈ రోజున వినాయకుడిని ఘనంగా పూజించడం, ఊరేగించడం, నిమజ్జనం చేయడం చేస్తుంటారు. కొంత మంది గణేష్ నవరాత్రులు అంటే 9 రోజులు వినాయకుడిని పూజించి 10వ రోజు నిమజ్జనం చేస్తారు. అయితే ఈసారి వినాయక చవితి పండుగ (Vinayaka Chavithi 2025 Festival) రోజు మీ బంధు మిత్రులకు ఇలా సింపుల్, అందంగా శుభాకాంక్షలు పంపి.. ఆనందంగా వినాయక చవితి పండుగ (Vinayaka Chavithi Festival) జరుపుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం గణేష్ చతుర్థి విషెస్‌పై ఓ లుక్కేసేయండి..
వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
తొలి పండుగ.. కొత్త సూర్యోదయం.. కొత్త ప్రారంభం
ఆ దివ్య గణేశుడి ఆశీస్సులతో.. మన జీవితాన్ని కూడా సరికొత్తగా ప్రారంభిద్దాం
మీకు మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
ఆదిపూజ్యుడైన విఘ్నహర్తకి అభివందనం పార్వతీనందనుడైన గణపతికి ప్రియవందనం ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి అపూర్వ నీరాజనం ఓం విఘ్నేశ్వరాయ నమ:
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు
వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
ఓం గన్ గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః
అస్త వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా
మీకు మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు